విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏది అయినా ఆయన దిగనంత వరకే.. ఒక్కసారి ఆ పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తే ప్రకాష్ రాజ్ కనిపించడు. అది ఆయన నటనలో ఉన్న గొప్పతనం. ఇక నటన పక్కన పెడితే.. సమాజంలో జరిగే తప్పులను భయపడకుండా నిలదీసే తత్త్వం ఆయనది.. ఇక పర్సనల్ గా ఆయనను వెంటాడే ఎమోషన్ ఆయన కొడుకు. మొట్టమొదటిసారి ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి…
ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఇంట విషాదం చోటు చేసుకుంది. రాఘవ తల్లి గోగినేని కమలమ్మ బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు కాగా ఆమెకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు రాఘవ సినీ,టీవీ రంగాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితం. ఇక రెండో కుమారుడు వెంకట్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. కమలమ్మ అంత్యక్రియలు గురువారం నాడు అంత్యక్రియలు జూబిలీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్నాయి.
టాలీవుడ్ నటుడు జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన 60 వ పుట్టినరోజు సందర్భంగా అవయవదానం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో జరిగిన అవయవదాన అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా గా హాజరైన ఆయన.. తన 60 వ పుట్టినరోజు సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..” మనిషిగా పుడతాం.. మనిషిగా పోతాం.. వెళ్ళేటప్పుడు ఎవ్వరు ఏమి తీసుకెళ్లారు.. ఒక్క 200…
మాటను పట్టుకొని సినిమా బాట పట్టినవారు ఎందరో ఉన్నారు. వారిలో కొందరే విజయం సాధించారు. కొందరు మాటలు పలికించడంతో పాటు, తెరపైనా గిలిగింతలు పెట్టారు. వారిలో రావి కొండలరావు సైతం స్థానం సంపాదించారు. రచయితగా, జర్నలిస్టుగా, నాటకరచయితగా ఇలా సాగిన తరువాతే చిత్రసీమ బాటపట్టారు రావి కొండలరావు. తరువాత చిత్రసీమలోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి అలరించారాయన. రావి కొండలరావు తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో 1932 ఫిబ్రవరి 11న జన్మించారు. రావి కొండలరావు తండ్రి…
ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.
ఇవాళ యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ లో తెరకెక్కుతున్న సినిమా పేరును నిర్మాత ఉషా ముల్పూరి ఖరారు చేశారు. అనీశ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘కృష్ణ వ్రింద విహారీ’ అనే పేరు పెట్టారు. కృష్ణ, వ్రింద మధ్య సాగే ప్రణయ ప్రయాణమే ఈ సినిమా. ఈ చిత్రంతో షిర్లే సేతియా కథానాయికా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రాధిక, ‘వెన్నెల’కిశోర్, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మాజీ,…
ఏ రంగంలో రాణించాలన్నా కృషిని మించిన సూత్రం లేదు. అయితే చిత్రసీమలో మాత్రం కృషి కంటే అదృష్టం ముఖ్యం అంటూ ఉంటారు. గుమ్మడి కాయంత ప్రతిభ కన్నా ఆవగింజంత అదృష్టం ఉంటేనే చిత్రసీమలో రాణించగలమని చెబుతారు సినీపెద్దలు. నవయువ కథానాయకుడు నాగశౌర్యలో ప్రతిభ ఎంతో ఉంది. ఇప్పటికే డజనుకు పైగా చిత్రాలలో నటించేశాడు. కొన్ని అలరించాయి. మరికొన్ని జనాన్ని పులకింప చేయలేకపోయాయి. దాంతో స్టార్ డమ్ కోసమై నాగశౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా…
“ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియెల్లో…” అనే పాట వినగానే నటుడు,నిర్మాత, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గుర్తుకు వస్తారు. ఇక ఆయన పేరు తలచుకోగానే ఎర్రజెండా సినిమాలే స్ఫురిస్తాయి. మాదాల రంగారావు తరువాత ‘రెడ్’ మూవీస్ కు అసలు సిసలు క్రేజ్ సంపాదించి పెట్టిన ఘనత నిస్సందేహంగా ఆర్.నారాయణ మూర్తిదే! చిన్నతనం నుంచీ మట్టివాసన గట్టిగా తెలిసిన వాడు కావడంతో మట్టిమనిషిలా జీవించాలని తపిస్తారు. ఏ హంగూ, ఆర్భాటమూ ఆయనకు ఇష్టం ఉండవు. అతి సామాన్యునిలా జీవిస్తారు. ఇప్పటికీ హైదరాబాద్…
‘నూటొక్క జిల్లాల అందగాడు’గా నూతన్ ప్రసాద్ పండించిన వినోదాన్ని తెలుగువారు అంత సులువుగా మరచిపోలేరు. నూతన్ ప్రసాద్ మాట, ఆట, నటన అన్నీ ఒకానొక సమయంలో ప్రేక్షకులను కిర్రెక్కించాయి. ఆయన నోట వెలువడిన మాటలు తూటల్లా జనం నోళ్ళలో పేలేవి. ఆయన విలనీ, కామెడీ, ట్రాజెడీ, సెంటిమెంట్ అన్నీ కూడా ఇట్టే ఆకట్టుకొనేవి. నూతన్ ప్రసాద్ అసలు పేరు వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణాజిల్లా కైకలూరులో జన్మించారు. చదువుకొనే రోజుల నుంచీ ఆయనకు ఇతరులను అనుకరిస్తూ…
నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ముందుగా మన మనసులో మెదలుతాయి. తాను ధరించిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి, జనాన్ని ఇట్టే కట్టిపడేయడంలో మేటి అనిపించుకున్నారు రఘువరన్. దక్షిణాది భాషలన్నిటా రఘువరన్ నటించి మెప్పించారు. కొన్ని హిందీ చిత్రాలలోనూ రఘువరన్ అభినయం ఆకట్టుకుంది. విలక్షణ నటునిగా జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు రఘువరన్. రఘువరన్ 1958 డిసెంబర్ 11న కేరళలోని కొల్లెంగోడెలో జన్మించారు. ఆయన తండ్రి హోటల్ నడిపేవారు. మధురలో హోటల్…