ఇవాళ్టి నుంచి మేడారంలో మహాజాతర. నాలుగురోజుల పాటు జరగనున్న జాతరకు కోటిన్నరమంది భక్తులు వస్తారని అంచనా. హెలికాప్టర్ లోనూ మేడారం వెళ్ళే అవకాశం.
ఇవాళ తిరుమలలో మాఘమాస పౌర్ణమి సేవ నిర్వహిస్తున్న టీటీడీ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై మాఢ వీధులలో విహరించనున్న మలయప్పస్వామి.
తిరుమలలో ఉదయాస్తమాన సేవా యాప్ ని ప్రారంభించనున్న టీటీడీ. ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించనున్న టీటీడీ.
తిరుమల అంజనాద్రిలో హనుమంతుడి ఆలయ నిర్మాణానికి భూమిపూజ. హాజరుకానున్న విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి,ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి,చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్యులు,అయోధ్య రామమందిరం ట్రస్ట్ కోశాధికారి గోవిందా గిరిజ మహారాజ్.
ఇవాళ వీసీలతో సమావేశం కానున్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
కలకత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్. 3 టీ20 మ్యాచ్ లు ఆడనుంది భారత్, వెస్టిండీస్. పూర్తిస్థాయి కెప్టెన్ గా రోహిత్ శర్మకు తొలి టీ 20 మ్యాచ్.
మేడారంలో గద్దెల మీద కొలువు తీరనున్న సారాలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు.
నేడు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం. పాల్గొననున్న బ్రహ్మోత్సవాల స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్,ప్రకాశం, మహబూబ్ నగర్ జిల్లాల ఉన్నతాధికారులు.
కాణిపాకం ఆలయంలో నేడు స్వర్ణ రథోత్సవం. నూతన బంగారం రధంపై విహరించనున్న స్వామివారు.