Trinamool Congress: పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ‘‘బాబ్రీ మసీదు’’ వివాదం నిప్పు రాజేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డిసెంబర్ 6 ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నమూనాతో మసీదు నిర్మిస్తామని ప్రకటించారు.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీకి వార్నింగ్ ఇచ్చింది. బీజేపీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం SIR ప్రక్రియ చేపడుతున్న సమయంలో ఆమె నుంచి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి నిబంధనల్ని నిర్దేశిస్తోందని, రాబోయే సర్ ప్రక్రియలో నిజమైన ఓటర్లను తొలగించవద్దని హెచ్చరించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కొనసాగుతున్న సమయంలో, బుర్ద్వాన్ జిల్లాలోని ఒక చెరువులో వందలాది ఆధార్ కార్డులు దొరికాయి.
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే(టీఎంసీ), పశ్చిమబెంగాల్ మాల్దా జిల్లా అధ్యక్షుడు అబ్దుర్ రహీమ్ భక్షీ చేసిన బెదిరింపు వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఒక బహిరంగ ర్యాలీలో భక్షీ మాట్లాడుతూ.. బీజేపీ నేతల నోటిలో యాసిడ్ పోస్తానని బెదిరించారు. ఆయన సిలిగురి బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యల వివాదస్పదం కావడంతో తాను అలాంటి ప్రకటన చేయలేదని అన్నారు.
ఇండియా కూటమి మంగళవారం సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు నేతలంతా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజే ఆయా అంశాలపై ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో గందరగోళం నెలకొనడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సమరం మొదలైపోయింది. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి-మార్చి మధ్యలో బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.
Mamata Banerjee: సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ మాట్లాడే ప్రజలను వేధిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. అలాగే, బెంగాలీ ప్రజల పట్ల ఆ ( బీజేపీ పాలిత) రాష్ట్రాలు చేస్తున్న దౌర్జన్యాలపై సిగ్గుపడాలి అని మండిపడింది.
Kolkata gangrape: దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో 24 ఏళ్ల లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత మోనోజిత్ మిశ్రాతో పాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలేజ్ క్యాంపస్‌లోని గార్డు రూంలో బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన చర్యలను నిందితులు మొబైల్స్‌లో వీడియో తీశారు. ఈ ఘటనపై టీఎంసీ పార్టీపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
Kolkata Rape Case: కోల్‌కతా లా విద్యార్థినిపై అత్యాచార ఘటన రాజకీయ దుమారానికి కారణమైంది. ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా(31)కు అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) స్టూడెంట్ వింగ్‌తో సంబంధం ఉండటం వివాదాన్ని మరింత పెంచింది. ఈ కేసులో ముగ్గురు నిందితులతో పాటు క్యాంపస్ సెక్యూరిటీ గార్డును కూడా అరెస్ట్ చేశారు.