తిరుపతిలో మరోసారి కలకం రేగింది.. ఒకే సారి ఐదుగురు టెన్త్ విద్యార్థులు కనిపించకుండా పోవడంతో.. వారు చదువుకుంటోన్న స్కూల్‌తో పాటు.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది… తిరుపతిలోని ఐస్ మహల్ సమీపంలో అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతోన్నారు విద్యార్థులు.. నెహ్రూ నగర్‌కు చెందిన మెహత, మౌనశ్రీ, గునశ్రీ అనే విద్యార్థినులు సహా మరో ఇద్దరు విద్యార్థులు కూడా అదృశ్యం అయ్యారు.. ఉదయం 6 గంటలకి స్టడీ అవర్స్ అంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు.. తిరిగి ఇంటికి రాకడంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.. ఇక, తల్లి దండ్రుల నుంచి ఫిర్యాదు అందుకున్న తిరుపతి వెస్ట్ పోలీసులు.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. అసలు వారు కనిపించకుండా పోవడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే కోణాల్లో విచారణ సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది.. విద్యార్థులు వెళ్లిన మార్గంలోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
Read Also: GVL Narasimha Rao: ప్రధాని మోడీ వైజాగ్ పర్యటన.. ఎంపీ జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు