TTD: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎస్వీ గోశాలలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారాలపై భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది.
Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా తిరుపతిలోని టీటీడీ అన్నదానం ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించింది. ఆమె కుమారుడు కొణిదెల మార్క్ శంకర్ పేరుతో సుమారు 17 లక్షల రూపాయలను ఉదారంగా విరాళం అందించారు.
TTD EO Shyamala Rao: తిరుపతి ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై టీటీడీ ఈఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్ కరుణాకరరెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
Anna Lezhneva : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. వారి కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. ఈ రోజు ఉదయమే ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు చేరుకుంది. కొడుకు క్షేమంగా బయటపడటంతో మొక్కులు చెల్లించేందుకు అన్నా లెజినోవా తిరుమలకు చేరుకున్నారు. అక్కడ ముందుగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు. ఆ తర్వాత వరాహ స్వామి దర్శనం చేసుకున్నారు. అటు నుంచి అటే సాధారణ భక్తురాలిగా…
Anna Konidela: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అనా కొణిదల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సోమవారం దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆదివారం సాయంత్రం ఆమె రేణిగుంట విమానాశ్రయం ద్వారా తిరుపతి చేరుకున్నారు. శ్రీమతి అనా కొణిదల రేపు (సోమవారం) వేకువజామున తిరుమలలో జరిగే సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం ఆమె స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తమ కుమారుడు మార్క్ శంకర్…
Vasamsetti Subhash: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమన వ్యవహారశైలి, ఆరోపణలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయమై మంత్రి వాసంశెట్టి భూమనపై ఘాటుగా స్పందిస్తూ.. భూమన.. “నోటి దురద తగ్గించుకో, లేకుంటే తాటతీస్తా” అంటూ హెచ్చరించారు. దేవాలయాలపై ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. Read Also: Kadapa:…
Pawankalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం నుంచి అతను కోలుకుంటున్నాడు. నేడు ఉదయమే పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు మార్క్ శంకర్ తో హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. సింగపూర్ లో అగ్ని ప్రమాదం బారిన పడ్డ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించిన…
నరసింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ కులానికి చెందినవాడిని కాకుండా మరో కులానికి చెందిన యువకుడితో లిఖిత వెళ్లిపోతుందన్న అనుమానంతో, పరువు పోతుందని భయంతో తల్లి సుజాత తన కుమార్తెను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు.
తిరుమలలో ఈరోజు నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి ఆలయం వెనుక వైపున ఉన్న వసంత మండపంలో ఈ వసంతోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 11) శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణ రథంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వసంతోత్సవాల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలను టీటీడి అధికారులు రద్దు చేశారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా సాలకట్ల వసంతోత్సవాలు…
టీటీడీలో సంస్కరణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏకంగా సీఎం చంద్రబాబు టీటీడీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు 50 సంవత్సరాలకు అనుగుణంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం..