Pawankalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదం నుంచి అతను కోలుకుంటున్నాడు. నేడు ఉదయమే పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు మార్క్ శంకర్ తో హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. సింగపూర్ లో అగ్ని ప్రమాదం బారిన పడ్డ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మూడు రోజుల పాటు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందించిన తర్వాత కోలుకుంటున్నాడు. దీంతో పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా నేడు తిరుమలకు వెళ్లబోతున్నారు. తన కుమారుడు కోలుకోవడంతో ఆమె శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు.
Read Also : Marriage : పిల్ల దొరుకుతలేదు.. పెరుగుతున్న పెళ్లికాని ప్రసాదులు..
ఈ రోజు రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. రేపు ఉదయమే దర్శనం చేసుకుని తలనీలాలు అర్పించి, శ్రీవారిని దర్శించుకుంటారు. మార్క్ శంకర్ తో పాటు ఆమె కూతురును కూడా తీసుకెళ్తున్నారు. దాంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కుటుంబంతోనే గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ కూడా వారితో కలిసి వెళ్తారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ అన్నా లెజినోవా మాత్రమే వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్, అన్నా లెజినోవా కలిసి తరుపతికి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ నడుమ తన ఇద్దరు కూతుర్లతో కలిసి తిరుమలకు వెళ్లారు పవన్ కల్యాణ్.