Vasamsetti Subhash: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూమన వ్యవహారశైలి, ఆరోపణలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయమై మంత్రి వాసంశెట్టి భూమనపై ఘాటుగా స్పందిస్తూ.. భూమన.. “నోటి దురద తగ్గించుకో, లేకుంటే తాటతీస్తా” అంటూ హెచ్చరించారు. దేవాలయాలపై ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Kadapa: క్రికెట్ బెట్టింగ్ భూతానికి బిటెక్ విద్యార్థి బలి..
భూమన గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసే సమయంలో జరిగిన అనేక అవినీతి కధలను గుర్తుచేస్తూ, “దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర నీది.. దోచుకున్నది చాలదా?” అని ప్రశ్నించారు. తిరుమల టెంపుల్ వంటి పవిత్రమైన స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఆయన అన్నారు. భూమన ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో స్పందించిన మంత్రి, “కరోనా వైరస్ కంటే ప్రమాదం నీ ప్రవర్తన” అంటూ విమర్శలు గుప్పించారు. అసత్య ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం తీవ్రంగా భావించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భూమన చేస్తున్న వ్యాఖ్యలను ‘పిచ్చి ప్రేలాపనలు’గా అభివర్ణించారు మంత్రి సుభాష్. “ఇలాంటివి కొనసాగితే రోగానికి మందేస్తాం” అంటూ హెచ్చరిక జారీ చేశారు.
అలాగే “నీ నీచ రాజకీయాలకు టీటీడీ దొరికిందా?” అంటూ ప్రశ్నించిన మంత్రి, ప్రజల మనోభావాలను కించపరిచే ప్రయత్నాలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. గోవుల సహజ మృతిని కూడా రాజకీయం చేయడాన్ని ఖండించారు. “ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొడితే తీవ్ర చర్యలు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో భూమన, టీటీడీ అంశం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం కనపడుతోంది.