బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరుగుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. తిరుమల కొండపై అన్యమత గుర్తులు కనబడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా తిరుమల లడ్డూలు యథేచ్ఛగా పంచారన్నారు దీపక్ రెడ్డి. జగన్.. హిందూ సమాజంపై, సాంప్రదాయాలపై చిన్న చూపు చూస్తున్నారు. అన్యమతస్థుడు జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాలి. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేటప్పుడు సతీసమేతంగా వెళ్లాలి. హిందువుల మనోభావాల్ని, దేవాలయాలను కాపాడాలి. జగన్, షర్మిల పెళ్లి క్రిష్టియన్ సంప్రదాయంగా జరిగింది. వీరు అన్య మతస్థులు.
Read Also: Mallareddy Narayana Hospital: మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ వరల్డ్ హార్ట్ డే ఈవెంట్
లోటస్ పాండ్ లోని జగన్ ఇంటిపై ఏసుక్రీస్తు క్రాస్ మార్క్ పెద్ద ఆకారంలో ఉంది. తిరుమలకు వచ్చినప్పుడు సోనియాగాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంలు డిక్లరేషనుపై సంతకం పెట్టినప్పుడు జగన్ ఎంతటివారు..? అంతర్వేదిలో ఘటన జరిగితే సీబీఐ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఇంతవరకు చేయించలేదన్నారు దీపక్ రెడ్డి. తిరుమల సంప్రదాయాలను కాపాడాలన్నారు.
Read Also: Sharath Kumar: సెట్ లో అందరి ముందు విజయశాంతి నన్ను తిట్టింది..