కలియుగ వైకుంఠం తిరుమలలో కనుల పండువగా సాగుతున్నాయి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.ఈ సాయంత్రం వేళ ముత్యపు పందిరి వాహనంపై మాఢవీధులలో విహరిస్తున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామిని కనులారా వీక్షించేందుకు భక్తులు క్యూకట్టారు. తిరుమల ఏడుకొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.