తిరుమలలో టీటీడీ ఉచిత బస్సు మిస్సింగ్ అయింది. ఉదయం 3 గంటలకు ఎలక్ర్టిక్ బస్సు జీయన్సీ టోల్గెట్ దాటినట్లు విజిలేన్స్ అధికారులు గుర్తించారు. వారం రోజులు క్రితం కూడా ఎలక్ట్రిక్ కారు కూడా మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. ఒంటిమిట్ట రామాలయం వద్ద కారుని గుర్తించినట్లు భధ్రతా సిబ్బంది పేర్కొంది. కారు మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చెయ్యకపోవడంతో దర్యాప్తు జరుగలేదు. దీంతో ఎలక్ర్టిక్ బస్సులో జీపీయస్ ద్వారా అధికారులు ట్రాక్ చేస్తున్నారు. నాయుడుపేట దగ్గర బస్సు లోకేషన్ ను అధికారులు గుర్తించారు.
Read Also: Skanda : థమన్ ను తెగ పొగిడేసిన హీరో రామ్..
టీటీడీ ఉచిత బస్సు మిస్సింగ్ ఘటనలో నాయుడుపేట పోలీసులను తిరుమల పోలీసులు అలర్ట్ చేశారు. నాయుడుపేట దగ్గర బస్సు ఛార్జీంగ్ అయిపోవడంతో బస్సుని రోడ్డు ప్రక్కన నిలిపివేసి దొంగ పరారు అయ్యాడు. దీంతో నాయుడిపేట పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు. దీంతో తిరుమల ట్రాన్స్ పోర్ట్ జీయంపై పోలీసులు సీరియస్ అయ్యారు. వారం రోజులు క్రితం కారు మిస్సింగ్ ఘటనపై కూడా పోలీసులకు జీయం శేషారెడ్డి సమాచారం అందించలేదని తెలిపారు. ఇవాళ బస్సు మిస్సింగ్ ఘటనలోను మీడియాలో వచ్చే వరకు పోలీసులకు జీయం సమాచారం ఇవ్వలేదు.
Read Also: Union Minister in AP: నేడు ఏపీలో ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన
బ్రహ్మోత్సవాల ప్రారంభం సమయంలో భక్తుల భధ్రత దృష్యా జీయం ట్రాన్స్ పోర్ట్ కి ముందస్తూగా పోలీసులు మోమో ఇచ్చారు. భక్తులకు సంబంధించిన రవాణా వాహనాలకు పూర్తి స్థాయిలో భధ్రతా ఏర్పాట్లు పరిశీలన చేసి.. బాధ్యతను జీయం వహించాలని పోలీసులు ఆదేశించారు. వాహనాలు చోరీకి గురైనా సమాచారం అందించకపోవడంతో ఎఫ్ఐఆర్ లో పోలీసులు జీయం శేషారెడ్డి పేరును చేర్చే యోచనలో ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో జీయం పేరు చేరితే సస్పేండ్ చేసే దిశగా టీటీడీ ఉన్నతాధికారులు చూస్తున్నారు.