Tirumala: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చే యాత్రికులు.. ఆ శ్రీనివాసుడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో.. శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుకొండల వాడి భక్తుల మనసులో ప్రత్యేక స్థానం ఉంది.
Read Also: Dowleshwaram Barrage: గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
అలాంటి తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి నాణ్యతలో నిబంధనల ప్రకారం ప్రమాణాలను పాటించిన ఓ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోనున్నట్లు టీడీడీ ఈవో శ్యామలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల టీటీటీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపాలను తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. ఏటా ముడిసరుకుల కొనుగోలు కోసం 500 కోట్లు వెచ్చిస్తుండగా.. అందులో నెయ్యి కొనుగోలుకే రూ.250 కోట్లు వెచ్చిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. నెయ్యి నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ ల్యాబ్‌కు నెయ్యిని టీటీడీ పంపింది. టీటీడీకి సరఫరా చేస్తున్న 5 మంది పంపిణీదారులలో తమిళనాడుకి చెందిన పంపిణీదారుడు సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత ప్రమాణాల లోపాలను టీటీడీ గుర్తించారు. ఈ క్రమంలోనే సరఫరాదారుడిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చేందుకు టీటీడీ ఈవో షోకాజ్ నోటీస్ జారీ చేశారు.