Tirumala Laddu: లడ్డూ ప్రసాదం అంశంపై కోయంబత్తూర్‌కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధినేత సద్గురు తన స్పందనను వ్యక్తం చేశారు. ఆలయ ప్రసాదంలో ఆవు కొవ్వును భక్తులు వినియోగించడం అత్యంత అసహ్యకరమని అన్నారు. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలని సద్గురు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదంగా అందించే లడ్డూలలో నెయ్యి కల్తీ అని ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర…
టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Bhumana Karunakar Reddy: తాజాగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల లడ్డు విషయంపై స్పందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వ్యక్తిత్వాన్ని, వైసిపినీ సమూలంగా నాశనం చేయడానికి చంద్రబాబు చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నాడు.. ఘటనపై సిబిఐ విచారణ కాని., సిట్టింగ్ జడ్జ్ తో కాని విచారణకు అదేశించే దమ్ముందా..? వెంకటేశ్వర స్వామీ ఆలయాన్ని నాశనం చేశారంటూ అబద్దాలు చెప్పి ఓట్లు వెయించుకున్నాడు చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వేసినా విజిలెన్స్ విచారణ…
CM Chandrababu: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవాళ (ఆదివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు.
అమృతతుల్యంగా... పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డు ప్రసాదం- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని ఎక్స్(ట్విట్టర్) వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. జంతు అవశేషాలతో మాలిన్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. విశృంఖల మనస్కులే ఇటువంటి పాపానికి ఒడిగట్టగలరన్నారు.
Manchu Vishnu – Prakash Raj: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతూనే ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, ముఖ్యంగా లడ్డు తయారీ విషయంలో నాసిరకం నెయ్యిని వాడారంటూ ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. దీంతో ప్రస్తుతం జాతీయ స్థాయిలో దేవాలయాల పరిరక్షణకు, అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఓ…
వివాదంగా మారిన తిరుమల లడ్డూ ఇష్యూ్కు ఇక్కడితో ముగింపు పలకాలని రాజకీయ పార్టీలను, మీడియాకు విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. అయితే, విచారణ జరిపించి నిజాలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుమల లడ్డూపై రాజకీయాలు చేయడం.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అభ్యంతరకరం అన్నారు.. ప్రజల మనోభావాలు దెబ్బతీసే వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు విష్ణుకుమార్ రాజు... కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ పాతాళానికి జారిపోవడం ఖాయమన్న ఆయన.. దేవుడిని మోసం చేసిన పార్టీలో ఉండాలో వద్దో అక్కడ వున్న నాయకత్వం ఆలోచించుకోవాలని సూచించారు. వైసీపీని వీడి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరాలని నేతలకు సూచించారు విష్ణుకుమార్ రాజు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కథ అని ఆయన పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ తీవ్రంగా విమర్శించారు.