మాజీ ముఖ్యమంత్రి జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఇవాళ విజయవాడ నుంచి తిరుపతికి నేటి సాయంత్రం వెళ్లాల్సి ఉంది. గతంలో నేటి రాత్రి తిరుమలలో బస చేసి రేపు(శనివారం) ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఉత్కంఠ రేపుతోంది. శ్రీవారి దర్శనార్థం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారాయన. అనంతరం రోడ్డు మార్గాన తిరుమల పయనమవుతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రేపు ఉదయం పదిన్నరకు శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ కు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ శ్రేణులు సిద్దమవుతున్నారు.
తిరుమల వ్యవహరం జగన్‌కు ఓ పొలిటికల్ ఈవెంట్ అని.. కానీ మాకు ఇది సెంటిమెంట్ అని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ఈ నెల 28వ తేదీన పూజలు చేయాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు. జగన్ చేసిన పాపాలు ఇక చాలు అంటూ వ్యాఖ్యానించారు.
Prakash Raj Again Targets Pawan Kalyan on Tirumala laddu Issue: తిరుమల లడ్డు వివాదం మీద ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. ఒకపక్క పొలిటికల్ లీడర్లు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటుంటే ఈ వివాదంలో ఎంట్రీ ఇచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మీద ఒక ట్వీట్ చేశారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. పవన్ ఫైర్ అయిన తర్వాత ప్రకాష్ రాజ్ తాను…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సప్లై చేసిన ఏఆర్ డెయిరీపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డెయిరీపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన టీటీడి మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.
Prakash Raj Releases a Video on Pawan Kalyan Comments: తిరుమల లడ్డు వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్ గా నడుస్తూనే ఉంది. తాజాగా ఈ విషయం మీద ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగు సినీ పరిశ్రమ మీద ఫైర్ అవడమే కాకుండా నటుడు ప్రకాష్ రాజు మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ప్రకాష్ రాజ్ పూర్తి అవగాహనతో మాట్లాడాలని సున్నిత అంశాల మీద అన్ని వివరాలు…
తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు సీపీఐ నారాయణ.. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన.. కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి.. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది.. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు..? తక్కువ రేటుకు నెయ్యి…
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది.. ఈ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇక, దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.. దుర్గమ్మ టెంపుల్ మెట్లను స్వయంగా శుభ్రం చేసిన పవన్.. ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టారు.. ఇక, అమ్మవారిని దర్శించుకున్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు..…