CPI Narayana: కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు.. లడ్డూ వ్యవహారం వీధుల్లోకి వద్దు..!
- తిరుమల లడ్డూ ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలి..
- ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చింది..
- కమ్యూనిస్టులు.. భక్తులకు.. దేవాలయాలకు వ్యతిరేకం కాదు..
- భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయన్న నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: తిరుమల లడ్డూ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోన్న వేళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుమల లడ్డూ వివాద ఘటనను సుప్రీంకోర్టు సుమోటో గా తీసుకుని విచారణ చేయాలని కోరారు.. ప్రజ సమస్యలు అన్ని పక్కనపెట్టి లడ్డూ సమస్య మొదటికి వచ్చిందన్న ఆయన.. కమ్యూనిస్టులు.. భక్తులకు, దేవాలయాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.. అయితే, భక్తుల మనోభావాలను దెబ్బకోట్టి విధంగా పరిస్థితిలు వచ్చాయి.. జగన్ రివర్స్ టెండర్లు పెట్టడం వల్ల తీవ్రమైన నష్టం కలిగింది.. అసలు ఎందుకు చెన్నై డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇచ్చారు..? తక్కువ రేటుకు నెయ్యి వస్తుందని.. లడ్డూలో ఎక్కడలేని దరిద్రాలు కలిపి తినమని చేబుతారా..? బుద్దిలేదా? అని ఫైర్ అయ్యారు..
Read Also: Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
తిరుమల నెయ్యి టెండర్లను రివర్స్‌లో చేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు నారాయణ.. దానివల్ల కల్తీ నెయ్యి జరిగిందని రిపోర్టు వచ్చింది.. నెయ్యి విషయంలో ఎలాంటి అలోచన లేకుండా వైసీపీ టెండర్లు ఇచ్చింది.. లోపం దొరికింది కాబట్టి చంద్రబాబు బయటపెట్టారని తెలిపారు.. జగన్ ఇసుక మాఫియాకు, ఎర్రచందనం మాఫియాకు బోర్డు సభ్యులుగా ఇచ్చాడు అని విమర్శించారు.. లడ్డూ నాణ్యత అనేది వైసీపీ ప్రభుత్వంలో లేదని.. వారం రోజుల ఉండే నాణ్యత ఒక్కరోజు కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు.. విచారణ కమిటీలో అన్ని తెలుతాయి… ఇకపై వీధుల్లో లడ్డూ వ్యవహారాన్ని తీసుకుని రాకండి అని సూచించారు.. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు సనాతన ధర్మం అంటే ముందు పవన్ కల్యాణ్ పూర్తిగా చదువుకోవాలని సూచించారు.. ఇంకోవైపు.. మోడీ మన ప్రధాన మంత్రి కాదు.. ఎప్పుడు విదేశాల్లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాలో ఉంటాడని సెటైర్లు వేశారు.. ఇక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు మేం ఒప్పుకోం అని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
తాజావార్తలు
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
-
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!