శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగం అంటూ వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.. అయితే, నిజానిజాలు నిగ్గు తేల్చే పనిలో పడిపోయింది సిట్.. కొంతకాలం ఈ వ్యవహారంలో సైలెంట్‌గా ఉన్న సిట్.. ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారంలో దర్యాప్తుని వేగవంతం చేసింది.. ఈ రోజు శ్రీవారి ఆలయంలోని పోటులో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది..
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్.. చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందన్నారు.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మత భావాలను రాజకీయాల కోసం ఎలా రెచ్చ గొడుతున్నాడు అనేది సుప్రీం గుర్తించిందని.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని స్ట్రాంగ్ కామెంట్స్ చేసిందన్నారు.. ఇక, చంద్రబాబు సిట్ ను సుప్రీం రద్దు చేసింది.. స్వామివారిని, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయాల కోసం అబద్ధాలు ఆడి జంతువుల కొవ్వు…
మరోసారి ఈ వివాదంలో హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. సీఎం ఏమైనా మాట్లాడవచ్చన్న బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.. బావ కళ్లలో ఆనందం కోసం కాకుండా.. భక్తుల కళ్లల్లో ఆనందం కోసం పని చేయాలి అంటూ సలహా ఇచ్చారు.. తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీం కోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్న ఆమె.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్…
తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్. పవన్ వెంట ఆయన సన్నిహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు…
Temple Clean: విజయవాడలో వైఎస్సార్‌సీపీ నేతలు వెళ్లిన దేవాలయాల్లో శుద్ధి చేసారు బీజేపీ నేతలు. ‘గోవు ఘోష విను గోవిందా’ పేరుతో గో మూత్రంతో ఆలయాలు శుద్ధి చేసారు. లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, బీజేపీ నేత అడ్డూరి శ్రీరామ్, చైతన్య శర్మలు శుద్ధి చేసారు. ఐదేళ్ల జగన్ పాలనలో తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. లడ్డూ తయారిలో నెయ్యి కల్తీ అనేది…
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వెల్లడించారు. స్వార్థ రాజకీయాల కోసం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు పాపాల ఎఫెక్ట్ ప్రజలపై పడకూడదని ఈ రోజు వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించామన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు..