Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల దోపిడి కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్స్ జాక్వలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహ్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జాక్వలిన్ ఫెర్నాండెస్ కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సుకేష్ లవ్ లెటర్ రాశాడు. ఈ లెటర్ లో మీడియాను ఆయన మద్దతుదారులను, వ్యతిరేకులను ఉద్దేశిస్తూ హోలీ విషెస్ తెలిపారు.
Bihar jail inmate swallows mobile phone: బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ డివిజన్ జైలులో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అండర్ ట్రయిల్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మింగేశారు. జైలులో పోలీస్ అధికారులు తనిఖీ చేస్తుండటంతో, తన దగ్గర ఉన్న ఫోన్ దొరుకుతుందనే భయంతో మింగేసినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఇది జరిగిన కొంత సేపటికి విపరీతమైన కడుపు నొప్పి రావడంతో ఖైదీని ఆస్పత్రికి తరలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
తీహార్ జైలులో సత్యేందర్ జైన్ మసాజ్ చేయించుకుంటున్న వీడియోను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత, జైలులో ఉన్న ఢిల్లీ మంత్రి సెల్ లోపల జైలు అధికారి ఢిల్లీ మంత్రిని కలిసిన మరో వీడియోను బీజేపీ విడుదల చేసింది. సత్యేందర్ జైలు సందర్శన గంటల తర్వాత తీహార్ జైలు సూపరింటెండెంట్‌ని జైలు గదిలో కలిశారు.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.
ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ రోజూ ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవలే పార్లమెంట్‌లో 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. పార్లమెంట్‌లో పనిచేస్తున్నా సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టులో 150 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 3వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికోసం ప్రత్యేక కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. Read: మనిషి…
సాధారణంగా ప్రతి మనిషికి ఒక భయం ఉంటుంది. ఆ భయంతోనే కొన్ని అనుకోని తప్పులు చేస్తాడు. కొన్నిసార్లు ఆ భయాలు వారి ప్రాణాలమీదకు తెస్తాయి. తాజాగా ఒక ఖైదీ.. అధికారులు తనను ఏమన్నా చేస్తారన్న భయంతో ముందు వెనుక చూడకుండా సెల్ ఫోన్ ని మింగేశాడు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఢిల్లీ తీహార్ జైల్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. తీహార్ జైలు నెం. 1 లో ఒక వ్యక్తి అండర్ ట్రయల్ ఖైదీగా వచ్చాడు. కొన్ని…
దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజుకు మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇక సమూహాల్లో వైరస్ మహమ్మారి వేగం మరింత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె, కరోనా మహమ్మారి ఢిల్లీలోని తీహార్ జైలును వణికిస్తోంది. దేశంలోని వివిధ జైళ్లలోని ఖైదీలు కరోనా బారిన పడుతున్నారు. రాజధాని ఢిల్లీలోని తీహార్ జైల్లో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా సోకిన ఖైదీలను ప్రత్యేక బ్యారక్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, కరోనా సోకిన నలుగురు ఖైదీలు చికిత్స…