తనకు లిక్కర్ కేసులో ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. నాలుగు పేజీలతో మీడియాకు లేఖ విడుదల చేశారు ఎమ్మెల్సీ కవిత. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు తనకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని.. లిక్కర్ కేసులో తాను బాధితురాలినని లేఖలో తెలిపారు
MLC Kavitha: నేడు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రూస్ ఏవ్ న్యూలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో చుక్కెదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా సీన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంట్రీ ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. సోమవారం ఆయన్ను జైలుకు తరలించారు. ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు... జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
Arvind Kejriwal: ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కోర్టు ఆయనకు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను తీహార్ జైలుకి తరలించారు. కేజ్రీవాల్‌ని జైల్ నెంబర్ 2లో ఉంచారు. ఇక్కడే అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్, కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా మరియు ఉగ్రవాది జియావుర్ రెహ్మాన్ ఉన్నారు.
CM Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తొలి రాత్రి తీహార్ జైలులో గడిపారు. సీఎం కేజ్రీవాల్‌కు తీహార్‌లో అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 670 ఇచ్చారు. సోమవారం రాత్రి జైలులో ఇంటి నుంచి తెచ్చిన ఆహారం ఇచ్చారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.