ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను తీహార్ జైలుకు తరలించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడి నేటితో ముగియడంతో ఆయనను ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఇక, కోర్టు కేజ్రీవాల్ కు జుడిషీయల్ రిమాండ్ విధించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత శనివారం సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు తీహార్ జైలుకు వచ్చిన కేజ్రీవాల్‌కు "స్వాగతం" అని సుకేష్ చంద్రశేఖర్ చెప్పాడు. "నిజం గెలిచింది, నేను అతన్ని తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను" అని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు.
దేశంలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Satyendar Jain: ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్టై తీహార్ జైలులో ఉన్నారు.
Tihar Jail: గ్యాంగ్‌స్టర్ టిల్లూ తాజ్‌పురియాను ప్రత్యర్థి ముఠా సభ్యులు తీహార్ జైలులో హత్య చేసిన కొన్ని రోజులకు కీలక పరిణామం సంభవించింది. 90 మందికి పైగా తీహార్ జైలు అధికారులను గురువారం ఉన్నతాధికారులు ట్రాన్స్పర్ చేశారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిప్యూటీ సూపరింటెండెంట్లు, హెడ్ వార్డర్లు, వార్డర్లు సహా 99 మంది అధికారులను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ (జైళ్లు) సంజయ్ బెనివాల్ ఆదేశించారు. రాబోయే రోజుల్లో మరిన్ని బదిలీలు ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
గ్యాంగ్‌స్టర్ తిల్లు తాజ్‌పురియాను కత్తితో పొడిచి చంపినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ (TNSP)లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో మూగ ప్రేక్షకులుగా నిలబడినందుకు వారిని తమిళనాడుకు తిరిగి పంపారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ఆదివారం తెలిపారు.
తీహార్ జైలులో గ్యాంగ్ వార్ జరిగింది.. ఈ ఘటనలో రోహిణి కోర్టు కాల్పుల కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్ టిల్లు తజ్‌పూరియా ప్రాణాలు కోల్పోయాడు.. జైల్లో జరిగిన గ్యాంగ్ వార్‌లో అతను మృతిచెందినట్టు తీహార్ జైలు అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కాన్‌మన్ సుకేష్ చంద్రశేఖర్ సహ ఖైదీలు, వారి కుటుంబాల సంక్షేమం కోసం రూ.5.11 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు అనుమతి కోరుతూ జైళ్ల డైరెక్టర్ జనరల్‌కు లేఖ రాశారు. ఆఫర్ అంగీకరించబడితే, ఇది ఉత్తమ పుట్టినరోజు బహుమతి అవుతుందంటూ లేఖలో పేర్కొ్న్నాడు.