Sukesh Chandrashekhar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి పంపిన ఒక రోజు తర్వాత శనివారం సుకేష్ చంద్రశేఖర్ ఒక సందేశాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ కోర్టుకు తీసుకెళ్తున్నప్పుడు తీహార్ జైలుకు వచ్చిన కేజ్రీవాల్‌కు “స్వాగతం” అని సుకేష్ చంద్రశేఖర్ చెప్పాడు. “నిజం గెలిచింది, నేను అతన్ని తీహార్ జైలుకు స్వాగతిస్తున్నాను” అని సుకేష్ చంద్రశేఖర్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా తాను అప్రూవర్‌గా మారతానని ఆయన అన్నారు. “నేను అతనిని (కేజ్రీవాల్) బహిర్గతం చేస్తాను. నేను అప్రూవర్‌గా మారతాను. అన్ని ఆధారాలు ఇస్తాను” అని సుకేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 11న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినప్పుడు ఇలాంటి సందేశాన్నే పంపాడు. మార్చి 18 నాటి లేఖలో ఇలాగే తీహార్ జైలుకు స్వాగతం అంటూ పేర్కొన్నాడు. “సత్యం గెలిచింది.. నీ కర్మలన్నీ నీకు తిరిగి వస్తున్నాయి” అని ఆ సమయంలో సుకేష్ చెప్పాడు.
Read Also: Wedding invitation: పెళ్లి కార్డుపై మోడీ ఫోటో.. బీజేపీ కార్యకర్త వినూత్న ప్రచారం..!
అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడం, సోదాలు చేసిన తర్వాత గురువారం సాయంత్రం ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం సాయంత్రం, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మద్యం పాలసీ కేసులో ఏడు రోజుల కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా ఈడీ కేజ్రీవాల్‌ను “స్కామ్‌లో కింగ్‌పిన్”గా అభివర్ణించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నేరాల ద్వారా వచ్చిన ఆదాయం ఆమ్ ఆద్మీ పార్టీకి భారీగా ప్రయోజనం చేకూర్చిందని, 2022 గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఉపయోగించారని ఆరోపించింది.