MLC Kavitha: నేడు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రూస్ ఏవ్ న్యూలోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 4న ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఇరుపక్షాల వాదనలు ముగిశాయని స్పష్టం చేశారు.
అనంతరం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేశారు. సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని స్పష్టం చేసింది. కాగా, కవిత 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారం (రేపటి)తో ముగియనుంది. దీంతో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వెలువడనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. కవిత బెయిల్‌ను కోర్టు తిరస్కరిస్తే.. మంగళవారం మరోసారి కవితను కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
Read also: Mumbai Indians: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్!
గత నెల 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. 16న ఆమె ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. మొదటిసారి ఏడు రోజులు, రెండోసారి మూడు రోజులు.. కోర్టు అనుమతితో మొత్తం 10 రోజుల పాటు ఆమెను కస్టడీలోకి తీసుకున్న ఈడీ. ఆమెను గత నెల 26న తిహాద్ జైలుకు తరలించారు. తన కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉన్నందున మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 4న విచారణ జరిగింది.
వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ భవేజా తీర్పును సోమవారానికి (8తేదీ)న వాయిదా వేశారు. సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న వాదనలు వింటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అదేవిధంగా కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా మంగళవారంతో ముగియనుంది. బెయిల్ దొరకని పక్షంలో కవితను మంగళవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో మరోసారి హాజరుపరచనున్నారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 20వ తేదీన జరుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Ganja Batch Attack: అత్తాపూర్ లో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్..