Kejriwal: కేజ్రీవాల్ హెల్త్‌పై అధికారులు కీలక రిపోర్ట్! ఆందోళనలో ఆప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. సోమవారం ఆయన్ను జైలుకు తరలించారు. ఏప్రిల్ 15 వరకు రౌస్ అవెన్యూ కోర్టు… జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య జైలుకు తరలించారు. అయితే కేజ్రీవాల్ ఆరోగ్యంపై జైలు అధికారులు కీలక రిపోర్టు విడుదల చేశారు. తొలి రోజు కేజ్రీవాల్ నీరసంగా ఉన్నారని.. అలాగే షుగర్ లెవల్స్ పడిపోయాయని అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి కేజ్రీవాల్ కొద్ది సేపు మాత్రమే నిద్ర పోయినట్లు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Tollywood: టాలీవుడ్లో వరుస విషాదాలు.. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురి మృతి!
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను ఈడీ కస్టడీకి రెండు సార్లు అనుమతి ఇచ్చింది. ఇక ఏప్రిల్ 1న తిరిగి కోర్టులో హాజరుపరచగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను సోమవారం సాయంత్రం 4 గంటలకు తీహార్ జైలుకు తరలించారు. ఇక సెల్‌లోకి పంపించే ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయి 50 కంటే తక్కువ ఉందని తేలింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఔషధాలు అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైల్లో ఆయనకు ఓ పరుపు, దుప్పట్లు, రెండు దిండ్లు అందించినట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అందించారు. రాత్రి కొద్దిసేపు కటిక నేలపైనే పడుకున్నారని, అర్థరాత్రి వరకూ సెల్‌లో అటు, ఇటు తిరుగుతూ కనిపించారని జైలు వర్గాలు వెల్లడించాయి.
ఇది కూాడా చదవండి: PM Modi: 10 ఏళ్లు అధికారంలో లేకుంటే, దేశం తగలబడుతుందని అంటున్నారు..
ఇక మంగళవారం ఉదయాన్నే ధ్యానం చేసుకున్న కేజ్రీవాల్‌కు.. అనంతరం చాయ్, రెండు బిస్కట్లు అందించారు. అనంతరం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం ఆయన జైలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంగా ఇంటి నుంచి తెచ్చిన ఆహారాన్ని అనుమతిస్తామని, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేవరకు వీటిని కొనసాగిస్తామని చెప్పారు.
సెల్ బయట జైలు వార్డర్‌తోపాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని నియమించారు. అత్యవసనర సేవల సిబ్బందినీ సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీకెమెరాల ద్వారా ఆయన్ను ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. కోరిన విధంగానే ఆయనకు రామాయణం, భగవద్గీత పుస్తకాలను అందించారు. అలాగే ఆయన మెడలో ఉన్న లాకెట్‌ను కూడా అనుమతించారు. మరోవైపు కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆప్ లీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సతీమణి సునీతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇది కూాడా చదవండి: Pushpa2 The Rule Teaser: పుష్ప గాడి కాళ్లకు గజ్జెలు కట్టి.. అద్దీ.. అట్టా హైప్ పెంచు మావ!
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!