Kavitha: లిక్కర్ కేసులో కీలక పరిణామం! సీబీఐ కస్టడీకి కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీంతో సీబీఐకి అనుమతి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. దీంతో జైల్లోనే ఆమెను విచారించాలని న్యాయస్థానం తెలిపింది. విచారణకు ముందు అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పింది. అలాగే విచారణ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని ధర్మాసనం షరతు పెట్టింది.
ఇక విచారణలో కవిత స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేయనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్‌లో దొరికిన సమాచారం ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారించనుంది. అలాగే భూముల కొనుగోలు వ్యవహారంపై కూడా ప్రశ్నించినుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన వంద కోట్ల వ్యవహారంపై సీబీఐ లోతుగా ప్రశ్నించనున్నట్లు సమాచారం.
Also Read
ఇదిలా ఉంటే తమ కుమారులకు పరీక్షలు జరుగుతున్నందున తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. గురువారం విచారించిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. తాజాగా సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను, మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఇద్దరికీ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఇద్దరూ తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇద్దరి బెయిల్ పిటిషన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతేడాది నుంచి తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆయనకు ఇంకా బెయిల్ లభించలేదు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!