అడవుల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. గోళ్లు, చర్మం కోసం పెద్ద పులులను దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వేటగాళ్ల దుర్మార్గానికి మరో పెద్దపులి బలైంది. మహారాష్ట్రలో వేటగాళ్ల ఉచ్చుకు మరో పెద్దపులి ప్రాణాలు కోల్పోయింది. గడ్చిరోలి జిల్లా అయిరి తాలుకాలోని అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి పెద్దపులి మృతిచెందింది. అనంతరం వేటగాళ్లు పులి కాళ్లు, తల తీసుకుని.. మొండాన్ని అదేచోట పూడ్చిపెట్టారు. డిసెంబర్ 30న అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సిబ్బందికి దుర్వాసన రావడంతో పరిశీలించగా..…
మా హీరో సింహం లాంటోడు.. చిరుత లాంటి కళ్లు.. సింహం లాంటి పొగరు అంటూ అభిమానులు తమ అభిమాన హీరోలను పొగడడం చాలాసార్లు వింటూనే ఉంటాం. ఇక స్టార్ హీరో కొత్త సినిమా పోస్టర్ రావడం ఆలస్యం.. సింహాన్నో, పులినో పక్కనపెట్టి.. అడవికి రాజు సింహం.. ఇండస్ట్రీకి రాజు మా హీరో అంటూ ట్యాగ్ లైన్ జోడించి సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. దీంతో సినిమాల్లో సైతం హీరోలను అదే విధంగా ఎలివేట్ చేస్తున్నారు.…
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులులు, చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం ఖర్జీ అటవీ ప్రాంతంలో మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కాపరి మహేష్ చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఎఫ్బీఓలు మధుకర్, రమేష్, రాకేష్, గ్రామస్తులు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవి పందిని తింటుండగా మేకల మంద రావడంతో…
ప్రపంచ పులుల దినోత్సవ వేడుకలను ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యల గురించి అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 47 నుంచి 63 కి ఈ సంఖ్య పెరిగింది. ఇక కడప, చిత్తూరు జిల్లాల్లోని అడవుల్లో పులుల ఆనవాళ్లు ఉన్నట్టుగా గుర్తించినట్టు…