PeddiReddy Ramachandra Reddy: తిరుపతిలోని ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రిపెద్దిరెడ్డి తిలకించారు. నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ బ్రోచర్స్, వెబ్ సైట్‌ను విడుదల చేశారు. అనంతరం ఉద్యోగంలో ప్రతిభ కనబర్చిన పలువురు అటవీ శాఖ సిబ్బందికి అవార్డులు ప్రదానం చేశారు. రష్యాలో టైగర్…
టైగర్ల గుంపు మధ్య ఓ గ్రామ సింహం దర్జాగా తిరిగేస్తోంది.. ఆ పెద్ద పులులు సరదాగా ఆడుకుంటున్నా.. కొట్లాడుతున్నా.. వాటి మధ్య దర్జాగా తిరుగుతోన్న ఆ శునకాన్ని మాత్రం ఏమీ అనడం లేదు.. సాధారణంగా అయితే, శునకాలను పెద్ద పులులు చంపేసిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ గుంపు మధ్య ఏ మాత్రం జంకు లేకుండా.. తిరుగుతున్నా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గోల్డెన్…
అడవుల్లో వుండాల్సిన వన్యప్రాణులు, పులులు, ఏనుగులు, ఎలుగుబంట్లు రోడ్లమీదకు, జనం మీదకు వచ్చేస్తున్నాయి. దీంతో జనం కంటిమీద కునుకులేకుండా గడపాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో గురువారం రాత్రి ఎలుగుబంటి హల్ చల్ చేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయ పరిసరాలతో పాటు ప్రక్కన నున్న అపార్టుమెంటు ప్రాంగణంలోకి చొరబడి కాసేపు చక్కర్లు కొట్టింది. తమ ప్రాంతంలో ఎలుగుబంటి సంచరిస్తుందని తెలుసుకున్న స్థానికులు భయాందోళన చెందారు. కాసేపు ఆ ప్రాంతంలో తచ్చాడిన ఆడిన…
నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమలకు భక్తులతో పాటు అడవుల్లో వుండే వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరిగేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం చిరుతపులులు, ఎలుగుబంట్లు, పాములు, జింకలు ఘాట్ రోడ్లపై కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వన్యప్రాణులు సంచారం కొనసాగుతుంది. సీజన్ బట్టి జంతువులు సంచరిస్తుంటాయి. ఆ మధ్య చిరుతలు….మొన్నటి వరకు ఏనుగులు సంచారంతో భక్తులు భయభ్రాంతులకు గురికాగా….తాజాగా ఎలుగుబంట్లు సంచారం భక్తులుతో పాటు స్థానికులును ఆందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం అర్దరాత్రి సమయంలో ఏకంగా మూడు ఎలుగు బంట్లు…
ఈమధ్యకాలంలో అడవుల్లో పులులు రోడ్లమీదకు వచ్చేస్తున్నాయి. జనాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంచారం సంచలనం రేపుతున్నాయి. కొంతమంది వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచారం చేస్తున్నాయనే వీడియోలు ప్రజలను దడ పుట్టిస్తున్నాయి. గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో పులులు సంచరించినట్లుగా కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వీడియోలు ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.…