ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పెద్దపులులు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో పెద్దపులి హల్ చల్ చేస్తుండడంతో జనం వణికిపోతున్నారు. అర్ధవీడు మండలంలో పెద్దపులి టెన్షన్ వేధిస్తోంది. మూడు రోజులగా మాగుటూరు, కాకర్ల, వెలగలపాయ గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తుంది పెద్దపులి. కాకర్ల పలనరవ సమీపం లోని అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన ఆవును చంపి తినేసింది పెద్దపులి. వెలగలపాయలో మరో ఆవుపై దాడి.. ఆవు పై దాడి చేస్తున్న క్రమంలో రైతులు కేకలు వేయడంతో పారిపోయింది పెద్దపులి. పెద్దపులి సంచారాన్ని ధ్రువీకరించారు అటవీశాఖ అధికారులు. పెద్దపులి సంచారం కారణంగా తీవ్ర ఆందోళనలో స్థానిక గ్రామస్తులు వున్నారు. పెద్దపులిని పట్టుకుని తమని కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు స్థానికులు.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అందాల నటి ఊర్మిళ మటోండ్కర్
గతంలో ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలను ఎలుగుబంట్లు, పులులు భయపెట్టిన సంగతి తెలిసిందే. అవి స్థానికులకు కంటి మీద కునుక లేకుండా చేశాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు బెంబేలేత్తించాయి. . భామిని మండలంలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. పార్వతీపురం మన్యం జిల్లా లోగల భామిని మండలం తాలాడ గ్రామంలో గత కొన్ని రోజులుగా ఏనుగుల ఘీంకారాలతో ప్రజలు వణికిపోతున్నారు. దీనికి తోడు దొరికిన పంటలు దొరికినట్లు నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పొలాలకు ఒంటరిగా వెళ్ళాలంటేనే వణికిపోతున్నారు.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న అందాల నటి ఊర్మిళ మటోండ్కర్