ఏపీలో వరుసగా థియేటర్లు మూత పడుతున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 థియేటర్లు మూతపడ్డాయి. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలను తగ్గించడంతో ఎగ్జిబిటర్లు వ్యాపారంలో నిలబడేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శ్యామ్ సింగ రాయ్, పుష్ప, అఖండ చిత్రాల ప్రదర్శనకు ఆంధ్రాలో తాజా పరిణామాలతో అంతరాయం ఏర్పడింది. కొన్ని థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు చేసి సీజ్ చేస్తున్నారు. మరోవైపు చాలామంది థియేటర్ యజమానులు తక్కువ టికెట్ ధరలతో సినిమా హాళ్లను నడపలేము అంటూ…
మెగాస్టార్ చిరంజీవి, హీరో విజయ్ దేవరకొండ శనివారం చేసిన ట్వీట్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. వీరు తమ తమ ట్వీట్స్ తో ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఎపి గవర్నమెంట్ కు సందేశాలను పంపగలిగారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రగడ జరుగుతోంది. జీవో 35ను అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేస్తే… కొంత మంది ఎగ్జిబిటర్స్ కోర్టుకు వెళ్ళి సింగిల్ జడ్జ్ తీర్పుతో దానిపై స్టే తీసుకు వచ్చారు. అయితే…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది.…
ఏపీలో టికెట్ రేట్లపై టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నిర్మాత సురేష్ బాబు వంటి ప్రముఖులు పెదవి విప్పి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. అయితే ఇంకా చాలామంది స్టార్స్ ఈ విషయంపై అసలు నోరు మెదపడం లేదు. తాజాగా నాని మరోసారి టికెట్ రేట్లపై కౌంటర్ వేశారు. నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన ‘స్కైలాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…