ఏపీలో టికెట్ రేట్లపై టాలీవుడ్ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సమస్యపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని, నిర్మాత సురేష్ బాబు వంటి ప్రముఖులు పెదవి విప్పి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు. అయితే ఇంకా చాలామంది స్టార్స్ ఈ విషయంపై అసలు నోరు మెదపడం లేదు. తాజాగా నాని మరోసారి టికెట్ రేట్లపై కౌంటర్ వేశారు.
నిత్యామీనన్, సత్యదేవ్ జంటగా నటించిన ‘స్కైలాబ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాని టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘స్కైలాబ్’ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మేకర్స్ కథను నాకు చెబుదామనుకున్నారట. దురదృష్టవశాత్తు ఈ సినిమా నాకు రాలేదు. కానీ అది నిత్యకు చేరినందుకు సంతోషంగా ఉంది. కాన్సెప్ట్ గురించి చెప్పాలంటే నా చిన్నతనంలో స్కైల్యాబ్ ఆకాశం నుండి కూలిపోతుందనే పుకారు వచ్చింది. అందరూ భయపడేవారు. ఇది సరదా అంశాలతో కూడిన ఆసక్తికరమైన అంశం అని నేను భావిస్తున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్” అని నాని అన్నారు.
Read Also : సామ్ “పుష్ప” స్పెషల్ సాంగ్ ఎప్పుడు? ఎక్కడ ?
నాని తన స్పీచ్ ను కొనసాగిస్తూ “డోంట్ వర్రీ సత్యా. టిక్కెట్ ధరలు, థియేటర్ల గురించి నేను మాట్లాడను. చివరిసారిగా మీ ‘తిమ్మరుసు’ కార్యక్రమంలో మాట్లాడినప్పుడే మొత్తం న్యూస్ ఆర్టికల్స్ దాని గురించే వచ్చాయి. మేము మాట్లాడాల్సింది అయిపోయింది. మిగతా వాళ్ళు మాట్లాడతారో లేదో చూడాలి. డిసెంబర్ 4న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పై పడబోతోంది అంటూ చమత్కారంగా కౌంటర్ వేశారు.
టిక్కెట్ ధర విషయంపై గతంలో పలు సందర్భాల్లో మాట్లాడిన నాని ఇదే విషయమై పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు, ఆయనకు సపోర్ట్ చేశాడు. ఇక నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ డిసెంబర్ 24న విడుదల కానుంది.