బంగాళాఖాతంలో కొనసాగుతుంది అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. ఈ నెల 25వ తేదీ వరకు తుఫాన్ గా మారితే రెమల్‌గా నామకరణం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Rains and Thunderstorms: అకాల వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది.. అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.. ఇక, ఈ రోజు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రకటించారు.. విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతుందని.. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు..…
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండలు దండి కొడుతున్నాయ. వడ గాల్పులతో ప్రజలు అల్లడిపోతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వేడి తీవ్రత మరింతే పెరిగే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు భారతదేశంలో వేడిగాలులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
గత కొద్ది రోజులుగా అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మిస్సిస్సిపిలో భారీ గాలులు, ఉరుములు కురుసిన వర్షాలకు 23 మంది మృతి చెందారు. టోర్నడోల ప్రభావంతో 100 మైళ్లకుపైగా నష్టం వాటిల్లింది.
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
దక్షిణ అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు ముందు వర్షాలతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మారింది. విశాఖలో చల్లని, ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు శ్రీశైలంలో భారీ వర్షం పడింది. అకాల వర్షంతో ప్రధాన వీధులన్నీ జలమయం అయ్యాయి. శ్రీశైలంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణంతో భక్తులు…