ప్రధాని మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చినట్లుగా ముంబై పోలీసులు వెల్లడించారు.
ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం బెదిరింపు కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పేర్కొంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. కాల్ చేసిన వ్యక్తి మహిళగా గుర్తించారు. ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే థ్రెట్ సందేశం వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ ఆఫీస్ కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం అందుతుంది.
Threat call: ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్‌ని పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు పాకిస్తానీయులు నగరానికి చేరుకుని తాజ్ హోటల్ని పేల్చివేస్తారని బెదిరిస్తూ ముంబై పోలీసుకలు బెదిరింపులు ఎదురయ్యాయి. సముద్రమార్గం ద్వారా వీరు ముంబైకి చేరుకున్నారని గురువారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాతవ్యక్తి కాల్ చేశాడు.
Nitin Gadkari: కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధికార నివాసంలోని ల్యాండ్ లైన్ నంబర్ కు గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి గడ్కరీ కార్యాలయ సిబ్బందికి ఫోన్ వచ్చిందని, కాల్ చేసిన వ్యక్తి తన వివరాలను పంచుకోకుండా, మంత్రితో మాట్లాడాలని, అతనిని బెదిరించాలని చెప్పినట్లు…
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు ఫోన్‌లో పేర్కొన్నందుకు 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశామని, ఆ కాల్ బూటకమని తేలిందని పోలీసులు గురువారం తెలిపారు.
Threat Call : హోలీ రోజు సొంత గ్రామానికి వచ్చిన యువకుడిని బీహార్‌లో మద్యం తాగనివ్వలేదు. దీంతో నేరుగా సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వ బంగ్లాను పేల్చివేస్తానని బెదిరించాడు.
టీవల ప్రముఖుల ఇళ్లను పేల్చేస్తామని, హోటల్‌లో బాంబు ఉందని భయపట్టే కాల్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, మెగాస్టార్స్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలకు చెందిన ముంబై బంగ్లాలను పేల్చివేస్తామని నాగ్‌పూర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి గుర్తు తెలియని వ్యక్తి బెదిరించాడు.
మహారాష్ట్రలోని పుణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.