Threat Call Received To Blow Up Mumbai Airport: ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పేల్చేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. తనను తాను ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదిగా చెప్పుకుని విమానాశ్రయాన్ని పేల్చేస్తామని హెచ్చరించాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ముంబై విమానాశ్రయానికి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అయోధ్య రామమందిరాన్ని బాంబులతో కూల్చేస్తామని ఓ ఆగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఆలయాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
Threat Call : గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ చేశారు. సోమవారం అర్థరాత్రి 12 గంటలకు పీసీఆర్ కాల్ చేసినట్లు కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తెలిపారు.
Threat Calls to Gadkari : రూ. 100కోట్లు ఇవ్వకుంటే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి హాని తలపెడతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ చేసిన వ్యక్తిని కర్ణాటక పోలీసులు గుర్తించారు.
ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్‌కు హత్యా బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్‌లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు.