Threat call: ముంబైలోని ప్రముఖ తాజ్ హోటల్‌ని పేల్చేస్తామని పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇద్దరు పాకిస్తానీయులు నగరానికి చేరుకుని తాజ్ హోటల్ని పేల్చివేస్తారని బెదిరిస్తూ ముంబై పోలీసుకలు బెదిరింపులు ఎదురయ్యాయి. సముద్రమార్గం ద్వారా వీరు ముంబైకి చేరుకున్నారని గురువారం ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాతవ్యక్తి కాల్ చేశాడు.
అయితే ఫోన్ చేసిన వ్యక్తి తన పేరును ముఖేష్ సింగ్ గా పరిచయం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. కాగా పోలీసులు విచారణ చేయగా.. అతని అసలు పేరు 35 ఏళ్ల జగదాంబ ప్రసాద్ గా తేలింది. ముంబైలోని శాంతాక్రూజ్ లో నివసిస్తున్న ఇతని స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్ లోని గోండా.
Read Also: Vijay varma : ఆ అభిమాని అడిగిన ప్రశ్నకు మండిపడిన విజయ్ వర్మ..
ముంబైలోని కొలాబా ప్రాంతంలోని తాజ్ హోటల్ లో 2008లో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలోనే ఉగ్రవాది అజ్మల్ కసబ్ పట్టుబడ్డాడు. దాదాపుగా 175 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 26/11 ముంబై ఎటాక్స్‌గా ఈ దాడి దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ దాడి అనంతరం పలు సందర్భాలో ఇలాగే దాడులు జరుపుతామని బెదిరింపు కాల్స్ వచ్చాయి.