Off The Record: 2024 ఎన్నికల్లో తగిలిన ఘోరమైన దెబ్బ నుంచి వైసీపీ దాదాపుగా కోలుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తోంది పార్టీ అధిష్టానం. నియోజకవర్గాల్లో నాయకులు కూడా అందుకు తగ్గట్టే గేరప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే… రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదపుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. రామగిరి ఎంపీపీ ఎన్నిక, హంద్రీనీవా కాల్వకు లైనింగ్ వంటి అంశాలతో జనంలోకి బాగానే వెళ్లారాయన. అలాగే… తన రాజకీయ…
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతపై మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో ఏ విషయంలో అయినా ఓ ఎమ్మెల్యేగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే అని, నువ్ ఏం ఇక్కడ మైసూర్ మహారాణివి కాదు అని మండిపడ్డారు. పోలీసులను అడగడానికి వెళ్లిన ప్రజలపై ఎందుకు కేసులు పెట్టావ్ అని ప్రశ్నించారు. హామీల అమలపై ప్రశ్నించిన జనాలకు చెప్పులు చూపిస్తావా?, ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని ప్రతిపక్ష నేతగా అడిగితే చెప్పు తెగుద్ది అంటావా? అని…
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వెన్నుపోటు పొలిటికల్ సీజన్ జోరుగా నడుస్తోంది. ఎవరు ఎవరిని పొడిచారు, అసలు పొడిచారా? లేదా అన్న వాదనల్ని కాసేపు పక్కనపెడితే... అందరి నోట అదే మాట మాత్రం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం ప్రోగ్రామ్ నిర్వహిస్తే... అంతకంటే ముందే... ఆ పార్టీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వెన్నుపోటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని ప్రకటించి సంచలనానికి తెరలేపారాయన.
మంత్రి నారా లోకేష్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా డమ్మీ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం కండువా కప్పుకుంటేనే పథకాలు ఇస్తాం అంటున్నారు? అని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అందరికీ కమీషన్లు వస్తున్నాయి.
Thopudurthi Prakash Reddy: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డి గ్రామ సమీపంలో హెలిప్యాడ్ దగ్గర జరిగిన ఘటనలో కీలక వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతన్నాడింతన్నాడు.. అంతే లేకుండా పోయాడు. ఈసారి నేను ఓడిపోతే... మీసం తీసేసుకుంటానంటూ.. మెలేసి మరీ ఒట్టేశాడు. ఇప్పుడు మీసం సంగతి దేవుడెరుగు.. అసలు మనిషే కనిపించకుండా మాయమైపోయాడంటూ.... రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారట నియోజకవర్గంలో.
ఒకప్పుడు నెత్తుటేళ్ళు పారిన అనంతపురం జిల్లాలో మళ్లీ రక్త చరిత్ర టాపిక్ తెర మీదికి వచ్చింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం లో జరిగిన ఒక హత్య దగ్గర మొదలైన మేటర్... ఫ్లాష్ బ్యాక్‌లో పరిటాల రవి మర్డర్ వరకు వెళ్తోంది. ఆ పాత గాయాలు మళ్లీ ఎందుకు రేగుతున్నాయి?
కొన్ని నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా.. అది వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. అక్కడి నాయకుల రాశి ఫలాలు అలా ఉంటాయని అంటారు కొందరు. ఇంకా కరెక్ట్‌గా మాట్లాడుకోవాలంటే... రాశి ఫలాలు అనేకంటే.... వాళ్ల మాటలు, చేతలు అనడం కెరక్ట్ అంటారు ఎక్కువ మంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఇలాంటివి మాత్రం తప్పవు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి అనంతపురం జిల్లా రాప్తాడు.