Thopudurthi Prakash Reddy: మంత్రి నారా లోకేష్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా డమ్మీ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం కండువా కప్పుకుంటేనే పథకాలు ఇస్తాం అంటున్నారు? అని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అందరికీ కమీషన్లు వస్తున్నాయి. ఇసుక, మట్టి, మద్యం ఏదీ వదలడం లేదు.. అన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు.. దొంగలే.. దొంగ దొంగ అని మాట్లాడుతున్నారు.. వైఎస్ జగన్ మీద కేసులు పెట్టి మీరు జనంలోకి వెళ్లగలుగుతారా..? అని ప్రశ్నించారు.. మీకు ఓటు వేసినందుకు మహిళల గొంతు కోశారు. రాష్ట్రానికి ఫ్లైట్ ఖర్చులు తప్ప మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఫైర్ అయ్యారు..
Read Also: Ponguleti Srinivas Reddy : ఏఐతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు చెక్..
జిల్లాలో హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయి అని విమర్శించారు. ఇక, రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటన, హెలికాప్టర్‌లో సాంతికే లోపాలపై మరోసారి స్పందించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి… హెలికాప్టర్ కనపడగానే పోలీసులు వెనక్కి వెళ్లారు.. భద్రత వైఫల్యంతో మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని దుయ్యబట్టారు.. అయితే, జగన్మోహన్ రెడ్డి హత్య కు ప్లాన్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. హెలికాప్టర్ దిగనీయబోమంటూ ఒకామె మాట్లాడుతున్నారు.. పోలీసులను. మమ్మల్ని కార్యక్రమానికి రాకుండా అడ్డుకోవడానికి మాత్రమే ఇచ్చారు అని విమర్శించారు.. రాప్తాడులో 350 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. రాప్తాడులో ఇప్పటికే ముగ్గురిని హత్య చేశారన్న ఆయన.. పార్టీ లో ఎవరు క్రమ శిక్షణ తప్పిన తప్పిస్తాం.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని ఎంకరేజ్ చేస్తే వారి పైన కూడా చర్యలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్రమశిక్షణ ఉల్లంఘన కింద 120 మంది పై చర్యలు తీసుకున్నామని వెల్లడించాడు..