నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు.
రాష్ట్రంలో ఓ వైపు పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.