Warangal: గ్రేటర్ వరంగల్ లో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి డోర్ హ్యాండిళ్లు, తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. గత రెండు రోజులుగా గ్రేటర్ పరిధిలో 10 దొంగతనాలు జరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు నగరవాసులు. దీంతో చోరీలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలోని 5 ఇళ్లలో చోరీ చేశారు. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పెళ్లి ఉండడంతో సిద్ధం చేసిన 45 తులాల బంగారం, 20 లక్షలకుపైగా నగదు…