హైదరాబాద్ నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు నగరవాసులు. దీంతో చోరీలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలోని 5 ఇళ్లలో చోరీ చేశారు. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పెళ్లి ఉండడంతో సిద్ధం చేసిన 45 తులాల బంగారం, 20 లక్షలకుపైగా నగదు అపహరణకు గురైందని ఓ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.