ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు నగరంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. శేషాపీరాన్ వీధిలోని కీర్తనా గోల్డ్ లోన్ కంపనీకి చెందిన సుమారు 22 లక్షల బంగారును కేటుగాళ్లు కొట్టేశారు. కంపెనీ నుంచి స్ట్రాంగ్ రూంకు రీజినల్ మేనేజర్ జాన్ బాబు బంగారు నగలను తరలించే క్రమంలో దుండగులు ఈ చోరీ చేశారు.
Hyderabad: బ్రతకలేక బావిలో పడితే కప్పలు కనుగుడ్లు తిన్నాయని.. భర్తతో గొడవపడి బయటకి వస్తే మహిళని మాటల్లో పెట్టి బంగారం మాయం చేశారు మరో ఇద్దరు మహిళలు.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని మధురానగర్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఈ నెల 13వ తేదీన తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాగా ఆ మహిళను గమనించిన మరో ఇద్దరు మహిళలు…
శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులో బైక్‌పై వచ్చిన వ్యక్తులు పార్క్ చేసిన బీఎండబ్ల్యూ కారు అద్దాలను పగులగొట్టి రూ.13.75 లక్షల నగదుతో పరారయ్యారు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల్లో భద్రతపై ఆందోళన నెలకొంది.. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వివరాల్లోకి వెళితే.. సర్జాపూర్‌లోని సోంపురాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. వీడియోలో, ఒకరు మోటారుబైక్‌పై వేచి ఉండగా,…
చోరీకి కాదేది అనర్హం అన్న తీరుగా దేశంలో పరిస్థితి తయారైంది. ఎక్కడ చూసినా దొంగలు అవాక్కయేలా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది.
Bengaluru Bus Shelter: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో అసెంబ్లీకి 1 కిలోమీటరు దూరంలో బీఎంటీసీ బస్సు కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ చోరీకి గురైంది. ఈ షెల్టర్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని జంగ్పురాలోని భోగల్లో ఓ భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని భోగల్లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో అర్థరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు.