నామినేటెడ్ పోస్టుల భర్తీ టీడీపీకి ఛాలెంజింగ్గా మారింది. పెద్ద ఎత్తున ఆశావహులు ఉండటంతో నామినేటెడ్ పదవుల భర్తీ కత్తి మీద సాములా మారింది. టీటీడీ, ఏపీఎస్సార్టీసీ, ఏపీ ఎండీసీ, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఐడీసీ, పీసీబీ, అప్కాబ్, మార్క్ ఫెడ్, దుర్గ గుడి ఛైర్మన్ వంటి కీలక పదవులకు డిమాండ్ పెరిగింది.