అఫ్ఘానిస్థాన్‌లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్‌లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్ అధికార వార్త సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. గత ఆగస్టులో…
అప్ఘాన్‌లో మగాళ్లకు గడ్డం ప్రాణ గండంగా మారింది. గడ్డం గొరిగిస్తే, ప్రాణం తీస్తామంటున్నారు తాలిబన్లు. షరియత్ చట్టాల్లో షేవింగ్‌కు స్థానం లేదంటూ బార్బర్ షాప్‌లకు వార్నింగ్‌లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్‌లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల…
అఫ్ఘాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తోంది. తాలిబన్లు కాబుల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు మూసివేశారు. దీనిపై తాలిబన్ల ప్రభుత్వం కొత్త ప్రకటనను విడుదల చేసింది. దేశంలో ఉన్న మదర్సాలు, ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. కాని అందులో అమ్మాయిలు ఉండరని స్ఫష్టం చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత విద్యార్థులందరూ కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అమ్మాయిలను కూడా…
తాలిబన్ల దురాక్రమణతో అప్ఘనిస్తాన్ వారి హస్తగతమైంది. తమ పాలనను ఒప్పుకున్నారా సరే? లేదంటే ఖతం కావాల్సిందే? అన్నట్లుగా తాలిబన్ల వైఖరి ఉంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తాలిబన్ల ప్రభుత్వాన్ని అంగీకరించాల్సి వస్తోంది. అయితే ఇప్పటికే తాలిబన్ల అరాచక పాలన చూసిన మహిళలు మాత్రం వారి పాలనలో బతకడం కంటే చావడం మేలు అన్నట్లుగా ఉన్నారు. దీంతో దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆ దేశ బోర్డర్లో వేలాది మంది అఫ్ఘన్లు…
ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ…
అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా…
ప్రస్తుతం అఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. భారత్ ముందు నుంచి ఊహించినట్లుగానే అప్ఘన్ కేంద్రంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ పై అఫ్ఘన్లు మాటమార్చడం.. తమ మిత్రదేశంగా పాకిస్థాన్, చైనాను మాత్రమే ప్రకటించడం చూస్తుంటే ఇవన్నీ కూడా భారత్ కు రాబోయే రోజుల్లో ఇబ్బందులు కలిగించే అంశాలుగా మారబోతున్నాయి. ఉగ్రవాదంపై తొలి నుంచి పోరాడుతున్న భారత్ కు తాలిబన్లు కంట్లో నలుసుగా…
అఫ్షనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల వశం కాకుండా ఆపుతున్నది ఏదైనా ఉందంటే అది పంజ్ షీర్ మాత్రమే. ఇప్పటికే అప్ఘనిస్తాన్ అంతటినీ ఆక్రమించిన తాలిబన్లు పంజ్ షీర్ ను మాత్రం హస్తగతం చేసుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య పంజ్ షేర్లో భీకరపోరు నడుస్తోంది. అయితే పంజ్ షేర్ ను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. అదేమీ లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా తాలిబన్లను తమ…
అప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడుతోంది. తమ మాతృభూమిని తాలిబన్లకు దక్కనిచ్చేది లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. నార్తర్న్ అలయెన్స్ పేరిట ఏర్పడిన గ్రూప్ ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కాకుండా పోరాడుతోంది. అయితే దీనికి విరుద్దంగా తాలిబన్లు మాత్రం తాము పంజ్ షేర్ ను స్వాధీనం చేసుకున్నట్లు…
అప్ఘన్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాలిబన్ల దెబ్బకు జడిసిన ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనం చిత్తగించాడు. దీంతో ఆ దేశంలో తాలిబన్లకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్కడి ప్రజలకు తాలిబన్ల పాలన ఇష్టం లేనప్పటికీ వారికి వారే గత్యంతరంలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు తమ ప్రభుత్వ ఏజెండాను ప్రకటించారు. తమకు సంబంధించి మిత్రులెవరో..…