ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది. అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ…
కరోనా మహమ్మరితో ప్రపంచం ఓవైపు పోరాడుతుండగా అప్ఘన్ మాత్రం తాలిబన్లతో పోరాడాల్సి వస్తోంది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు అప్ఘన్లో రెచ్చిపోతున్నారు. తాలిబన్ల దురాక్రమణతో ఆదేశ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్ల రాక్షస పాలన ఇదివరకే ఓసారి చూసిన అప్ఘన్లు వారి పాలనను ఒప్పుకునేది లేదని తెగెసి చెబుతున్నారు. తాలిబన్లు మాత్రం తమ పాలనను అప్ఘన్లు ఒప్పుకోవాల్సిందే.. లేదంటే చావాల్సిందే అన్నట్లుగా…
అతంర్యుద్ధంతో అల్లాడుతున్న ఆఫ్గనిస్తాన్‌ని మరో పెను ప్రమాదం వెంటాడుతోంది. అదే ఆకలి సంక్షోభం. లక్షలాది మంది చిన్నారులు ఆకలికి అలమటిస్తున్నారు. ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గోధుమ, బియ్యం, చక్కెర , నూనె ధరలు సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో లేడు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు…వలసలు..తాజాగా తాలిబాన్ సంక్షోభం. వెరసి ధరలకు రెక్కలొచ్చాయి. కరోనాకు ముందు ధరలతో పోలిస్తే 50 నిత్యావసర సరుకుల ధరలు శాతానికి పైగా పెరిగాయి.స్వచ్చంద సంస్థ సేవ్ ది చిల్డ్రన్ తన…
తాలిబన్లను ప్రపంచమంతా అరాచక శక్తిగానే చూస్తోంది. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి మహిళలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంత దారుణంగా పాకిస్థాన్‌లో మాత్రం తాలిబన్లను కీర్తిస్తున్నారు. తాలిబన్ల విపరీత చేష్టల్ని పొగుడుతూ బాలికలతో పాటలు పాడిస్తున్నారు పాకిస్థాన్ ఛాందసవాదులు. ఇస్లామాబాద్‌లోని మహిళల మదర్సాలో తాలిబన్లను పొగుడుతూ పాటలు పాడారు బాలికలు. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లకు మద్దతుగా సమావేశం జరిగింది. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కట్టారు. పాకిస్థాన్‌లో కూడా…