శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు ఇవాళ (మంగళవారం) శ్రీలంక క్రికెట్‌కు తెలిపాడు. పరిమిత ఓవర్లపై నజర్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హసరంగా తెలియజేశాడు. ఇక అతడి నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా అంగీకరించరింది.
Read Also: Seerat Kapoor: త్రివర్ణ రంగుల్లో మెరిసిన సీరత్ కపూర్
తాము వనిందు హసరంగా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము అని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మా వైట్-బాల్ టీమ్ లో హసరంగా కీలక ఆటగాడిగా కొనసాగుతాడని లంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా వెల్లడించారు. కాగా.. శ్రీలంక పరిమిత ఓవర్ల టీమ్ లో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న హసరంగా.. టెస్టులకు మాత్రం గత కొంత కాలంగా దూరంగానే ఉంటున్నాడు. అతడు చివరగా టెస్టుల్లో 2021లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్‌లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడినట్లు చెప్పాడు.
Read Also: Minister RK Roja: గాంధీ, అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పాలన..
4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లను వనిందు హసరంగా తీసుకున్నాడు. అదే విధంగా ఇప్సటి వరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20ల్లో అతడు ఆడాడు. హసరంగా ప్రస్తుతం శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో బీలవ్‌కాండీ టీమ్ కు సారథిగా కొనసాగున్నాడు. ఇటీవల జింబాబ్వేలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో శ్రీలంక జట్టు అజేయంగా నిలిచి, వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో హసరంగ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో హసరంగ 22 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు.