Pahalgam Attack: ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదుల్ని వేటాడి హతమారుస్తు్న్నారు. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్లలో విజయాలు సాధిస్తున్నారు. విదేశీ, స్థానిక ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పటి వరకు ఆరు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 21 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో 12 మంది పాకిస్తాన్ పౌరులు కాగా, 9 మంది స్థానిక వాసులు. ఆపరేషన్…
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్‌లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు.
జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా ఉగ్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో కనీసం ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి.
Terrorist Killed: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలోని ఉరీ సెక్టార్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. ఇక్కడ ఉగ్రవాదులపై ఆర్మీ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కమల్‌కోట్ ప్రాంతం నుంచి చొరబాటుదారులు చొరబడేందుకు ప్రయత్నం చేసారు. దాంతో సైనిక సైనికులతో వారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. Also Read: Blast In Delhi: ఢిల్లీలో భారీ పేలుడు.. కార్ల అద్దాలు ధ్వంసం ఎన్‌కౌంటర్ గురించి…
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలో సైదా గ్రామంలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక జవాన్ అమరుడు కాగా, ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.
Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ అట్టుడుకుతోంది. వరసగా ఉగ్రవాద ఘటనలతో ఆ ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఆదివారం రియాసిలో బస్సుపై దాడి చేసిన ఘటనలో 10 మంది యాత్రికులు చనిపోయారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)కి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
భారత సైన్యం మరోసారి ఉగ్రవాదుల చొరబాటు యత్రాన్ని భంగం చేసింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖవెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది.
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ దార్తో సహా ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.