Pakistan: పాకిస్తాన్ దేశంలో వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా హతమవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఉగ్రవాదిని పాయింట్ బ్లాక్‌లో కాల్చి చంపేసి అంతే వేగంతో మాయమవ్వడం జరుగుతోంది. ఇప్పటి వరకు భారత వ్యతిరేక ఉగ్రవాదులు 19 మంది ఇలాగే చనిపోయారు. ఆదివారం రోజు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన కీలక ఉగ్రవాది హబీబుల్లాని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో కాల్చి చంపారు.