జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లోని ఆరు రాష్ట్రాల్లోని 100కి పైగా సోదాలు నిర్వహించింది. వివిధ ఉగ్రవాద గ్రూపులతో గ్యాంగ్‌స్టర్‌లకు, డ్రగ్స్ స్మగ్లింగ్ మాఫియాకు ఉన్న సంబంధాలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
Jammu Kashmir: తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్ తన బుద్దిని మార్చుకోవడం లేదు. భారత్ లో, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాకిస్తాన్ ఆర్మీ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
వివాదాస్పదమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా కొత్త తరహా ఉగ్రవాదాన్ని బయటపెట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బెంగళూరులో ఈ చిత్రాన్ని ఆయన ఆదివారం వీక్షించారు.
Bilawal Bhutto: షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారీ హాజరయ్యారు. దాదపుగా 12 ఏళ్ల తరువాత ఓ పాకిస్తాన్ ప్రతినిధి ఇండియాకు రావడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్‌లో ఘోర జరిగింది. ఉగ్రవాద నిరోధక మందుగుండు సామగ్రి డిపోలో సోమవారం జరిగిన రెండు పేలుళ్ల సంభవించాయి. ఈ ఘటనలో దాదాపు 13 మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
S Jaishankar: భారతదేశాన్ని ఇరకాలంలో పెట్టాలని దాయాది దేశం పాకిస్తాన్ తో పాటు డ్రాగన్ కంట్రీ చైనా చీటికి మాటికి సరిహద్దు వివాదాలు, సీమాంతర ఉగ్రవాదాలను తెరపైకి తీసుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చైనా, పాక్ లను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది విభిన్న భారతదేశం అని, దేశ భద్రతకు ముప్పు వస్తే వారికి గట్టి బదులిస్తాం అంటూ
ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలున్న అనుమానితులపై భారీ అణిచివేతలో భాగంగా ఈరోజు కర్ణాటక, తమిళనాడు, కేరళలోని దాదాపు 60 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుల్గామ్ లో భద్రతా బలగాలు శుక్రవారం జైషే మహ్మద్ మాడ్యూల్ ను చేధించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్, రెండు మోర్టల్ షెల్స్, భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తర సోమాలియాలో యూఎస్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సీనియర్ వ్యక్తి బిలాల్-అల్-సుడానీని హతమార్చిందని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం సజీవంగా ఉందని, పాకిస్థాన్తో చర్చలు జరపడం ద్వారానే దాన్ని అంతం చేయగలమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు.