TS SSC Results 2024:తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు.
Summer Holidays: తెలంగాణ సర్కార్ పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా అని చూసే వారికోసం ఎండాకాలం సెలవులను ప్రకటించింది.
పదవ తరగతి ప్రధాన పరీక్షలు నేటితో ముగియనున్నాయి. వొకేషనల్ విద్యార్థులు మాత్రం మరో రెండు పరీక్షలు రాయాల్సి ఉంది. వారికి జూన్1న చివరి పరీక్ష ఉంటుంది. కరోనాను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పరీక్షలను 6 పేపర్లకే పరిమితం చేశారు. జూన్ 2న స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభించనున్నారు. జూన్ 25 లోపే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ఈనెల 23న ప్రారంభమైన విషయం తెలిసిందే.కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటి సారిగా…
ఈ రోజు నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు జూన్ 1 వరకు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. అయితే ఈ ఏడాది 5 లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2861 పరీక్ష…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెన్త్ పరీక్షల సందర్భంగా రోజూ ఒకచోట పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం… అవన్నీ ఫేక్ న్యూస్ అని.. జరిగింది మాల్ ప్రాక్టీసే అంటూ పోలీసులు స్పష్టం చేయడం తెలిసిన విషయమే. కానీ పేపర్ లీక్ జరిగింది నిజమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌లు వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వాట్సాప్ గ్రూప్‌లలో…
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజూ పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి పేపర్ లీక్‌లు కాదని మాస్ కాపీయింగ్ జరుగుతోందని విద్యాశాఖ వివరణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను…
ఏపీలో బుధవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో పేపర్ లీక్ అయ్యిందని వదంతులు రాగా కలెక్టర్ హరినారాయణ స్పందించి వాటిని ఖండించారు. తాజాగా నంద్యాల జిల్లాలోనూ టెన్త్ ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాచ్ మెన్ ద్వారా రూమ్ నెంబర్ 3…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే పేపర్ లీక్ అంశం స్థానికంగా కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు -1 పేపర్ వాట్సాప్‌లో రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయితే పలమనేరులో పదో తరగతి…