ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు. పదో…
ఏపీలో పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. గురువారం పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ప్రకటన చేసింది. పరీక్షల సమయంలో విద్యా కేంద్రం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం ఉచితంగా చేయవచ్చని సూచించింది. ఉచిత ప్రయాణం చేయాలంటే…
ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. హాల్‌టిక్కెట్లను bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పెట్టామని.. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వీటిని డౌన్‌లోడ్ చేసి వాటిపై సంతకాలు చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన కోరారు. విద్యార్థుల ఫోటోలు సరిగ్గా లేకపోతే సరైనవి అంటించి వాటిపై సంతకాలు చేసి ఇవ్వాలన్నారు. ఈ వివరాలను ప్రభుత్వ…
తెలంగాణలో టెన్త్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మే 11 నుంచి పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుంచి విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే కరోనా వల్ల ఈ ఏడాది కూడా అంతంత మాత్రమే క్లాసులు జరిగాయ్. దీంతో విద్యార్థులను పరీక్షలకు ఎలా సన్నద్ధం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అటు పరీక్షలు ఎలా రాయాలో తెలియక విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. తెలంగాణలో చివరిగా టెన్త్ పరీక్షలు 2018-2019…
కరోనా కారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్‌లు విద్యావ్యవస్థలో గందరగోళానికి గురిచేస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ తరహా పిటిషన్‌లు విద్యార్థులను తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ వ్యాఖ్యానించారు. కరోనా నేపథ్యంలో క్లాసులు సరిగ్గా జరగని కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షలతో పాటు టెన్త్, ఇంటర్…
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే…
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం మధ్యాహ్నం మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,05,052 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 4,81,481 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు…
ఇవాళ తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకాడమిక్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. ఏడాది కాలంలో 213 రోజులు పాఠశాల పనిదినాలుగా ఉంటాయన్నారు. 47 రోజులు ఆన్టైన్ ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 25 లోపు…