ఈ రోజు నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు జూన్ 1 వరకు జరగనున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే.. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు అధికారులు. అయితే ఈ ఏడాది 5 లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 2861 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేసి అధికారులు… కోవిడ్ నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్ష పేపర్ లను 11 నుండి 6 కు కుందించింది విద్యా శాఖ. అంతేకాకుండా.. ప్రశ్నల్లో ఛాయిస్ పెంచారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాలు(9.35) తర్వాత పరీక్ష కేంద్రాలకు అనుమతించబడదని వెల్లడించారు.