దొంగలు రెచ్చిపోతున్నారు. హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ కాటేదాన్ లో దొంగలు పేట్రేగిపోతున్నారు. మొన్న దేవాలయంలో చోరీకి పాల్పడ్డారు. అది మరచిపోకముందే ఏటీఎం లో చోరీకి విఫలయత్నం చేశారు. అలారం మ్రోగడం తో పరారయ్యారు దుండగులు.కాటేదాన్ శ్రీ రామ్ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న యాక్సెస్ బ్యాంక్ ఏటీఎం లోకి చొరబడ్డారు కొంతమంది దుండగులు. తమతో తెచ్చుకున్న రాడ్ తో ఏటీఎం డోర్ ధ్వంసం చేశారు దుండగులు. డోర్ తెరచుకోవడంతో వెంటనే అలారం మోగింది. దీంతో వెంటనే అలర్ట్…
ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు. ప్రాణహిత పుష్కరాలు నేటితో పరిసమప్తం కానున్నాయి .దీంతో ప్రాణహిత పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లా పాపలతో పుష్కర స్నానాలకు బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు…
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల గుండా ప్రవహించే ప్రాణహిత నది పుష్కరాలు చివరి అంకానికి చేరుకున్నాయి. మిగిలింది మరో రెండు రోజులే కావడంతో వివిధ ప్రాంతాలనుంచి పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు భక్తులు. ఇవాళ్టితో పదవ రోజుకు చేరుకున్నాయి ప్రాణహిత పుష్కరాలు. కొమురం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి పుష్కర ఘాట్ కు తరలి వస్తున్నారు భక్తులు. ప్రాణహిత పుష్కరఘాట్లు ఇవే తుమ్మిడిహెట్టి– కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిరోంచ – మహారాష్ట్ర…
ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్. హిందూ దేవతలను రాష్ట్రంలో అవమానిస్తున్నారు. అంతర్వేది రథదహనంతో ప్రారంభమై అనేక సంఘటనలు హిందువుల మనో భావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ సంఘటనలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవతలను అవమానిస్తారా? పెదకాకాని ఆలయంలో ముస్లిం వ్యక్తి మాంసం వండటం హైందవ మతాన్ని అవమానించడమే. ఇంత దారుణం జరుగుతుంటే.. పోలీసులు , అధికారులు చోద్యం చూస్తున్నారు. జిన్నా టవర్ పేరు చెప్పగానే…
మహాశివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంలో దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 24 వతేదీ నుండి శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మరోవైపు విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఈ నెల 26వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు మహా శివరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు వైదిక కమిటీ తెలిపింది. 26న శనివారం ఉదయం 9.30 గంటలకు శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు, వధూవరులుగా అలంకరణ జరుగుతుంది. సాయంత్రం 4…
తెలంగాణలో ఆలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వీకర్ సెక్షన్ కాలనీలలో ఆలయాల నిర్మాణానికి రూ. 7.56 కోట్లు కేటాయించామన్నారు. దీనికి సీజీఎఫ్ కమిటీ ఆమోదం తెలిపింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాల అభివృద్ధికి సీయం కేసీఆర్ ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని దేవాదాయ వాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం అరణ్య భవన్ లో కామన్ గుడ్ ఫండ్ కమిటీ సభ్యులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. సర్వశ్రేయో…
మొన్నటి రోజున రాష్ట్రంలో సంపూర్ణ మధ్యపాన నిషేధం విధిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన మరుసటి రోజే అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో విపక్షాలు మండిపడిన సంగతి తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ చేయిస్తామని స్వయంగా బీహార్ ముఖ్యమంత్రి ప్రకటించారు. కాగా, ఇప్పుడు దేవాలయాల ఆదాయంపై నాలుగు శాతం పన్నులు చెల్లించాలని బీహార్ బోర్డ్ రిలీజియస్ ట్రస్ట్ ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది సొంత…
కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. నాగులచవితి కూడా కావడంతో మహిళలు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరం భక్త జనో సందోహంతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుండి గోదావరి నది తీరాన భక్తులు స్నానం ఆచరించి శివాలయాలకు క్యూ కడుతున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి…