ప్రాణహిత నదికి భక్తులు పోటెత్తారు. ప్రాణహిత పుష్కరాలు నేటితో పరిసమప్తం కానున్నాయి .దీంతో ప్రాణహిత పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసాయి. పాఠశాలలకు వేసవి సెలవులు కూడా ప్రకటించడంతో పిల్లా పాపలతో పుష్కర స్నానాలకు బయలుదేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ప్రాణహిత పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. పుష్కరాలు చివరిరోజు కావడంతో వేకువ జామున నుండే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కాళేశ్వరం త్రివేణి సంగమానికి చేరుకొని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చారు.
నదీమ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ దీపాలు వదులుతున్నారు. తీరంలో పురోహితులతో శ్రాద్ధ కర్మ పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. వివిధ రాష్ట్రాల నుండి త్రివేణి సంగమ తీరానికి చేరుకుంటున్నారు భక్తులు. గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు,ఆలయంలో పూజలతో ఆ ప్రాంతం కిటకిటలాడుతోంది.తుమ్మిడిహెట్టి– కౌటాల మండలం, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా, అర్జునగుట్ట–మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం, సిరోంచ – మహారాష్ట్ర, వేమనపల్లి – మంచిర్యాల జిల్లాల్లోని పుష్కర ఘాట్లు ఇవాళ రద్దీగా వున్నాయి.
Read Also: Pranahitha Pushkaralu: చివరి అంకానికి ప్రాణహిత పుష్కరాలు