వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను కలవరపెడుతున్నాయి. దేవాలయాలే టార్గెట్ గా.. ఏడాదిన్నర కాలంలో మూడు సార్లు ఆలయాల్లో చోరీలు జరిగాయి. తాజాగా మండలంలోని రెండు ఆలయాల్లో గత రాత్రి చోరీ జరిగింది.
మొన్నటి మొన్న దీపావళి రోజు సూర్యగ్రహణం ఏర్పడగా.. 15 రోజుల తర్వాత పౌర్ణమి సందర్భంగా ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడనుంది… సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ కాలంలో చంద్రుడు ఎరుపు రంగులోకి మారనున్నాడు.. దీనినే బ్లడ్ మూన్ అని కూడా అంటారు.. ఈ సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలో ఉండనున్నారు.. అయితే, ఈ సంపూర్ణ చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపించబోతోంది.. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం కార్తిక…
హిందువులు ఎంతో భక్తితో ఎదురు చూసే మాసం రానేవచ్చింది.. ముఖ్యంగా ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. పుణ్యస్నానాలు ఆచరించేవారు, మాలధారణ చేసేవారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారు.. వ్రతాలు చేసుకునేవారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, కార్తిక మాసం ఇవాళ ప్రారంభం కావడంతో.. శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది..
Kottu Satyanarayana: ఏపీలో ప్రముఖ దేవాలయాల్లో క్షురకులుగా పనిచేసే వారికి ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్షురకులకు నెలకు కనీసం రూ.20వేల ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రూ.20వేల కంటే తక్కువ వచ్చే ఆలయాల్లో ఆలయ వెల్ఫేర్ ట్రస్టు ద్వారా మిగతా మొత్తాన్ని ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన ఆలయాల్లో టిక్కెట్ల ద్వారా క్షురకులు ప్రతి నెలా ఆదాయం పొందుతున్నారని.. ఒకవేళ వాళ్లకు రూ.20వేల…
ఏపీలో 5లక్షల లోపు ఆదాయం కలిగిన ఆలయాలకు దేవాదాయ శాఖ ఫీజుల నుండి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి హర్షం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగిన ఆలయాలకు ఫీజుల మినహాయింపు అభినందనీయం అన్నారు స్వరూపానందేంద్రస్వామి, కోర్టు సూచన మేరకు తక్షణం ఈ నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషదాయకం అన్నారు. ఈ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఇబ్బందులు తగ్గుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు…
తమిళనాడు ప్రభుత్వం, ఆలయాల నిర్వాహకుల మధ్య వివాదం చినికి చినికి గాలివాన చందంగా మారుతోంది. నేడు ఆస్తుల లెక్కపై దీక్షితుల వైఖరి పై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. చిదంబరం ఆలయాల్లో దీక్షితులదే నిర్వహణ బాధ్యత. అయితే, ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు దేవాదాయ శాఖ. తాజాగా అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణం అవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అధీనాధిపతులు,…
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన దేవాలయాల్లో బ్రాహ్మణేతురులను అర్చకులుగా నియమించడానికి చర్చలు జరగాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పండితులు, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. అనువంశిక అర్చకత్వం కొన్ని దేవాలయాల్లో మాత్రమే ఉందన్నారు. దళిత వాడల్లో దళితులనే అర్చకులుగా నియమించడం ఎప్పట్నుంచో ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్ ప్రక్రియపై దృష్టి పెడుతున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్‌లో…
ఇతర మతాల ప్రార్ధనా మందిరాలపై, ఆస్తులపై లేని ప్రభుత్వ పెత్తనం..! హిందూ దేవాలయాలు, వాటికి సంబంధించిన ఆస్తుల పైనే ఎందుకు..? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలోని రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం మాత్రమే ఉన్న హిందూ దేవాలయాలు అన్నింటినీ ఆయా ఆలయాల అర్చకులకే అప్పగించాలని… ఆ దేవాలయాల పాలన బాధ్యతల నుంచి దేవాదాయ శాఖ తప్పుకోవాలంటూ.. తాను విడుదల చేసిన ప్రకటనలో డిమాండ్ చేశారు. Read…